Bethesda Church Hyderabad

Ruchi Choochi

రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు

Verse 1
గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతున్
దయాళుడవు నీవే

Verse 2
మహోన్నతుడవగు దేవా
ప్రభావము గలవాడా
మనసార పొగడెదను నీ
ఆశ్చర్య కార్యములన్

Verse 3
మంచి తనముగల దేవా
అతి శ్రేష్టుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను
అతి సుందరడవనియు

Verse 4
కృతజ్ఞతా చెల్లింతున్
ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి
పొంది హర్షించెదను

Verse 5
ప్రార్ధింతును ఎడతెగక
ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగ పొందెదను
అడుగువాటన్నిటిని

To be updated soon