Verse 1
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ <>చేరితి
నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద
ఆనందం ఆనందమే
ఆశ్చర్యమే ఆశ్చర్యమే
ఆరాధనా ఆరాధనా
Verse 2
నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి
ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా<>
స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా
ఆరాధనా ఆరాధనా
Verse 3
బలియైన గొఱ్ఱెగా పాపములంతటిన్
మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా
నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా పరమాత్ముడా
ఆరాధనా ఆరాధనా
Verse 4
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా
నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా నుందును
నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా యేసునాధా
ఆరాధనా ఆరాధనా
To be updated soon