పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా –
వరదూతలైన నిన్ – వర్ణింప గలరా ‘పరిశుద్ధ’
1.పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ –
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా ‘పరిశుద్ధ’
2.పరిశుద్ధ తనయుడ – నరరూపధారుడ –
నరులను రక్షించు – కరుణా నముద్రా ‘పరిశుద్ధ’
3.పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ –
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా ‘పరిశుద్ధ’
4.జనకకుమారాత్మ – లను నేక దేవ –
ఘనమహిమచెల్లును – దనర నిత్యముగా ‘పరిశుద్ధ’
To be updated soon