Bethesda Church Hyderabad

Papanni Pogotti

Verse 1
పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ
భూలోకం వచ్చావయ్యా
మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు
సిలువను మోసావయ్యా

Pre-Chorus
కన్నీరే తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్యా

Chorus
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా

Verse 2
బంగారం కోరలేదు వజ్రాలు కోరలేదు
హృదయాన్నీ కోరావయ్యా
ఆస్తీయు అడగలేదు అంతస్తు అడగలేదు
హృదయాన్నీ అడిగావయ్యా

Pre-Chorus
నే వెదకి రాలేనని
నా కోసం వచ్చావయ్యా

Chorus
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా

Verse 3
తల్లి నిన్ను మరచిన – తండ్రి నిన్ను మరచిన
యేసయ్య మరువడయ్యా
బంధువులు విడచిన స్నేహితులు విడచిన
యేసయ్య విడువడయ్యా

Pre-Chorus
చేయిపట్టి నడిపావయ్యా
శిఖరముపై నిలిపావయ్యా

Chorus
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా

To be updated soon