ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే
లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం
చూడన్నా… చూడన్నా
Verse 1
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును
Verse 2
పరమును విడచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను
Verse 3
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలచి లేచాడన్న
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును
Verse 4
మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
మనిషిగా మారిన దేవుడేగా
మరణం పాపం తొలగించెను
Chorus
ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరే
లేరన్నా లేరన్నా
యేసే ఆ దైవం
చూడన్నా… చూడన్నా
To be updated soon