Bethesda Church Hyderabad

Nadipinchu Na Naava

నడిపించు నా నావ
నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున
నా జన్మ తరియింప
నడిపించు నా నావ

Verse 1
నా జీవిత తీరమున
నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు

నా యత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము
నా సేవ జేకొనుము
నడిపించు నా నావ

Verse 2
రాత్రంతయు శ్రమపడిన
రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను
రాదాయెను ప్రతిఫలము

రక్షించు నీ సిలువ
రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో
రాజిల్లు నా పడవ
నడిపించు నా నావ

Verse 3
ఆత్మార్పణ చేయకనే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి

ఆశానిరాశాయే
ఆవేద నెదురాయె
ఆధ్యాత్మిక లేమి గని
అల్లాడె నా వలలు
నడిపించు నా నావ

Verse 4
ప్రభు మార్గము విడిచితిని
ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని
పరమార్థము మరచితిని

ప్రపంచ నటనలలో
ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిప్పుడు
పాటింతు నీ మాట
నడిపించు నా నావ

Verse 5
లోతైన జలములలో
లోతున వినబడు స్వరమా
లోబడుటకు నేర్పించి
లోపంబులు సవరించి

లోనున్న ఈవులతో
లోతైన నా బ్రతుకు
లోపించని అర్పణగా
లోకేశ చేయుమయా
నడిపించు నా నావ

Verse 6
ప్రభు యేసుని శిష్యుడనై
ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో
పరిశుద్ధుని ప్రేమ కథ

పరమాత్మ ప్రోక్షణతో
పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు
పానార్పణము చేతు

To be updated soon


Chords


[wpchords]

Coming soon!

[/wpchords]



Lyrics-Telugu


 


Lyrics-English


Coming Soon!