మేలులు నీ మేలులు
మరచిపోలేనయ్యా
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా
Verse 1
కొండలలో ఉన్ననూ
నీవు మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ
నీవు విడచిపోలేదయ్యా
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా..
గొర్రెపిల్ల మనస్సయ్యా
Verse 2
అగ్నిలో ఉన్ననూ
నేను కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా
నేను మునిగిపోలేదయ్యా
నీది పావురము మనస్సయ్యా యేసయ్యా..
పావురము మనస్సయ్యా
Verse 3
చీకటిలో ఉన్ననూ
నన్ను మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ
మంచి స్నేహితుడవయ్యావయ్యా
నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా..
ప్రేమించే మనస్సయ్యా
To be updated soon