Verse 1
మహిమకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము – నిన్నారాధింతుము
మహోన్నతుడా – అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు – నీలా లేరు ఎవ్వరు
Verse 2
స్తుతులకు పాత్రుడా – స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేము ఆరాధింతుము
మహోన్నతుడా – అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు – నీలా లేరు ఎవ్వరు
Verse 3
అద్వితీయ దేవుడా – ఆది సంభూతుడా
మా కరములను జోడించి – మేము మహిమ పరచెదం
మహోన్నతుడా – అద్భుతాలు చేయువాడా
నీలా లేరు ఎవ్వరు – నీలా లేరు ఎవ్వరు
To be updated soon