మారనిది మరువనిది
విడువనిది ఎడబాయనిది
ప్రేమ యేసయ్య ప్రేమా
మారనిది మరువనిది
విడువనిది ఎడబాయనిది
Verse 1
నేను మరచిన గాని
నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని
నను విడువనన్న ప్రేమ
పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమా
Verse 2
తల్లి మరచిన గాని
నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని
నను విడువనన్న ప్రేమ
ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిటిలో నను హత్తుకున్న ప్రేమా
Verse 3
నేను పుట్టకముందే
నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే
ఏర్పర్చుకున్న ప్రేమ
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా
అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమా
To be updated soon