హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
Verse 1
తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి
Verse 2
సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించే యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి
Chorus
రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి
Verse 3
యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా దేవుని స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి
Verse 4
అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమున మన దేశస్తులు నింపుదురు స్తుతియించుడి
To be updated soon