ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర
హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా యేసయ్యా
Verse 1
నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే
హల్లెలూయా యేసయ్యా…
Verse 2
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు
నీ కొరకై నీ కృపలో
హల్లెలూయా యేసయ్యా…
Verse 3
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు
హల్లెలూయా యేసయ్యా
Verse 4
నీ సన్నిధి నాలో నా సర్వము నీలోనా
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివి దేవా
హల్లెలూయా యేసయ్యా…
Verse 5
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్
హల్లెలూయా యేసయ్యా…
To be updated soon