Bethesda Church Hyderabad

Christmas Subhavelalo

ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో
సంతోషముగ నే కీర్తించెద  క్రీస్తేసుని సన్నిధిలో
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం||

ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను    
మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను    
 ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో      
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం||

 దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి  
 బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి    
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో      
పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం||

 జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను   
 కన్యక గర్భాన ప్రభుపుట్టెను  ప్రవచనమే నెరవేరెను   
” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో      
 పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను”  ||ఆనందగీతం||

To be updated soon