దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము
పాపము క్షమియించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము
దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము
Verse 1
దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధమునుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుము దదేవ
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి
Verse 2
తుఫానులెన్నో మాపై కొట్టగా
వరదలెన్నో ముంచి వేయగా
పంటలన్ని పాడైపోయే
కఠినకరువు ఆసన్నమాయే
దేశపు నిధులే ఖాళీయయే
బీదరికం నాట్యం చేయుచుండే
Verse 3
మతము అంటు కలహలేరేగగా
నీది నాదిని భేదం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండి వుందని
ఈ దేశమునకు క్షేమమునిచ్చునని
క్రైస్తవ్యము ఒక మతమే కాదని
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి
To be updated soon