నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ
వెనుదీతువా – వెనుదీతువా
Verse 1
ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా
Verse 2
పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా
Verse 3
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా
Verse 4
కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా
To be updated soon