Bethesda Church Hyderabad

Durdinamulu Raakamunde

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక

Verse 1
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది
తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు

Verse 2
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి
యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని

To be updated soon