Bethesda Church Hyderabad

Vandanaalu Vandanaalayya

యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,
కాపాడినందుకు వందనాలయ్యా

Chorus
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా

Verse 1
నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా

నీ జాలి నాపై కనపరచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా

Chorus
వందనాలు వందనాలయ్యా
శతకోటి స్తోత్రాలయ్యా
యేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా

Verse 2
జీవ గ్రంథములో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా

నన్ను నరకము నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా

యేసయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు,
కాపాడినందుకు వందనాలయ్యా

To be updated soon