యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు
రారాజుగా వచ్చు చున్నాడు
Verse 1
మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు
లోకమంతా శ్రమకాలం
విడువబడుట బహుఘోరం
Verse 2
ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది
ఈ సువార్త మూయబడున్
వాక్యమే కరువగును
Verse 3
వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును
నీతి శాంతి వర్ధిల్లును
న్యాయమే కనబడును
Verse 4
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును
వంగని ప్రతి మోకాళ్ళు
యేసయ్య యెదుట వంగిపోవును
Verse 5
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు
రెప్ప పాటున మారాలి
యేసయ్య చెంతకు చేరాలి
To be updated soon